ఇక నుండి ప్రతీ వారం నా అభిమాన గాయకులైన యేసుదాస్ లేక సుశీల పాటలను పరిచయం చేద్దామనుకుంట్టున్నాను.
ఈ వారం యేసుదాస్ పాడిన చెంకోల్ అనే మళయాళ చిత్రంలోని పాట.
ఇది ఒక విషాద సందర్భంలో వచ్చే పాట.కథానాయకుని కుటుంబం జీవితంలో ఓడిపోయి మూగగా రోదిస్తూ ఉండే సందర్భం .
యేసుదాస్ తన గళంలో పలికించే విషాదం ,వేదన మనల్ని వేరే లోకంలొకి తీసుకువెళ్తాయి.
ముఖ్యముగా రెండో చరణంలో వచ్చే సంగతులు తనలోని పరిపూర్ణ గాయకుణ్ణి ఆవిష్కరిస్తాయి.మన సినిమా రంగం చేసుకున్న పుణ్యం దాసేట్టన్ మనకు లభించడం.
Headphones పెట్టుకుని వింటే పాటలోని మాధుర్యాన్ని ఇంకా బాగా ఆస్వాదించవచ్చు.